ఏ మాటకు ఆ మాట... లిప్ లాక్స్ విషయంలో హీరోయిన్స్ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది వాస్తవం. చాలా మంది కొత్త హీరోయిన్ లు లిప్ లాక్ సన్నివేశాలు అనగానే అమ్మో అనే పరిస్థితి ఉంటుంది. బాలీవుడ్ లో అది కామన్ అయి ఉండవచ్చు గాని టాలీవుడ్, తమిళం, మలయాళంలో మాత్రం కాస్త హీరోయిన్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. దర్శక నిర్మాతలు వాళ్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అందుకే ముందు లిప్ లాక్ సీన్ చెయ్యడానికి ముందు హీరోయిన్లు సిద్దం అంటేనే చేస్తారు. 

 

అయితే ఒక హీరో మాత్రం లిప్ లాక్ సీన్ విషయంలో హీరోయిన్ కి చుక్కలు చూపించాడు. హీరోయిన్ నాలుక కోరికేసాడు. ఆమె నాలుకను చప్పరించాడు... సాట్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఉట్రాన్‌ అనే సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రాజా గజనీ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో రోషన్‌ హీరోగా హిరోషిణి హీరోయిన్‌ గా నటించారు. ఈ సినిమాలో ఉన్న ఒక లిప్ లాక్ సన్నివేశం చాలా వివాదాస్పదంగా మారింది. కథ చెప్పే సమయంలో లిప్ లాక్ సీన్ గురించి హీరో హీరోయిన్ కి దర్శకుడు వివరించారు. 

 

కాని హీరో మాత్రం హీరోయిన్ కి చుక్కలు చూపించాడు. లిప్ లాక్ అంటే పెదవులపై పెదవులను ఆనించడం అలా చేయకుండా ఆహీరో చెలరేగిపోయాడు. ఏకంగా స్మూచ్ చేసాడు ఆ సినిమాలో హీరో. స్మూచ్ అంటే నాలుకను చప్పరించడం. హీరో బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేసాడు. దీనితో హీరోయిన్ దర్శకుడిపై ఫైర్ అయింది. ఆ హీరో తనకు స్మూచ్ చేసాడు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత దర్శకుడు ఆమెకు నచ్చచెప్పి షూటింగ్ స్టార్ట్ చేసాడట. ఈ వార్త అప్పట్లో హైలెట్.

మరింత సమాచారం తెలుసుకోండి: