సినిమా పరిశ్రమలోకి తొలితరం హీరోయిన్లుగా ప్రవేశించిన షావుకారు జానకి, జమున, సావిత్రి, అంజలీదేవి, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజశ్రీ వంటి వారి నటన అప్పట్లో అత్యద్భుతం అనే చెప్పాలి. హీరోయిన్ అంటే నిండుగా చీర కట్టుకొని అవసరమైన మేరకు నగలు పెట్టుకుని, కొద్దిగా మేకప్ వేసుకొని అప్పటి నటీమణులు కెమెరా ముందుకు వచ్చేవారు. అలానే పాత్ర యొక్క పరిధి మేరకు అక్కడక్కడా కొన్ని సార్లు మోడ్రన్ డ్రెస్సుల్లో వారు కనిపించినప్పటికీ, అది కూడా పూర్తిగా ఒంటిని కప్పి ఉంచే డ్రెస్ లే ఉండేవి. అలానే కేవలం హీరోకి మాత్రమే కాకుండా ప్రతి సినిమాలో అప్పట్లో హీరోయిన్ కి కూడా సమానమైన ప్రాధాన్యత ఉండడంతో పాటు, మిగతా పాత్రలను కూడా అప్పటి దర్శక నిర్మాతలు ఎంతో గొప్పగా చూపించడం జరిగేది. ఇక రాను రాను మెల్లగా సినిమా ఇండస్ట్రీలో సరికొత్త పోకడులు, విధానాలు రావటం, అలానే హీరోయిన్ల పాత్రలు, వారి నడవడికలో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. 

 

ఇక ఆపై వచ్చిన జయప్రద జయసుధ, వాణిశ్రీ, శారదా వంటి వారు కూడా అందమైన కట్టు, బొట్టుతో పాటు అద్భుతమైన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. అనంతరం వచ్చిన తరంలో శ్రీదేవి, విజయశాంతి, రాధ, సుహాసిని, రాధిక వంటి వారి యొక్క హవా మొదలవడం, వారు కూడా నిండా దుస్తులతో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో లేటెస్ట్ ఫ్యాషన్ డ్రస్సులతో మెరిసేవారు. ఇక అక్కడి నుండి రాను రాను హీరోయిన్ పాత్రకు మెల్లగా ప్రాధాన్యత తగ్గటం, అలానే హీరోయిన్ ఎక్కువగా రొమాంటిక్ పాత్రలకే పరిమితం కావడం జరుగుతూ వస్తోంది. అదే ఇప్పటి పరిస్థితి వస్తే, హీరోయిన్ అనే పాత్ర కేవలం రొమాన్స్ కు మాత్రమే పూర్తిగా పరిమితం అనేలా అక్కడక్కడా కొందరు దర్శకులు తమ సినిమాలు తీస్తున్నారని ప్రేక్షకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల సీనియర్ నటీమణి ఒకరు, ప్రస్తుత సినిమాల్లో హీరోయిన్ యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ, అప్పట్లో ఒంటినిండా దుస్తులు వేసుకుని పాత్ర యొక్క పరిధి మేరకు హీరోతో కలిసి సినిమాల్లో మేము డ్యూయెట్లు పాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

 

అయితే ఇప్పుడు హీరోయిన్ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా, ఒక వ్యాంప్ క్యారెక్టర్ మాదిరిగా చిన్న చిన్న గుడ్డ పీలికల వంటి దుస్తులు ధరించి, వ్యాంపు క్యారెక్టర్ల మాదిరిగా అక్కడక్కడా వచ్చే శృంగార సన్నివేశాల కోసం తప్పించి హీరోయిన్లు దేనికి ఉపయోగపడటం లేదని, ఆ విధంగా కొందరు దర్శకులు సినిమాల్లో హీరోయిన్ పాత్ర స్థాయిని దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా మరికొందరు దర్శకులు మాత్రం హీరోయిన్ ని ఎంతో గొప్పగా చూపించే వారు ఉన్నప్పటికీ, అటువంటివారు తీస్తున్న సినిమాలు పెద్దగా ఆదరణ పొందక పోవటం నిజంగా దారుణమని అని చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: