ముందుగా బలరామాయణం సినిమాతో నటుడిగా చిన్నతనంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆపై నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారారు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా ఎన్నో సూపర్ హిట్స్ తో దోసుకెళ్లిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండేళ్లక్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ లో మరొక నటుడు రామ్ చరణ్ తో కలిసి తొలిసారిగా నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా పూర్తయిన అనంతరం మరొక్కమారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు ఎన్టీఆర్. 

 

అయితే కొన్నేళ్ల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా ఊపిరి. అప్పట్లో మంచి హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమా, మంచి సక్సెస్ సాధించి హీరోలు ఇద్దరికీ కూడా ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో వాస్తవానికి కార్తి పాత్రలో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉందట. ముందుగా సినిమా స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత నాగార్జున తో పాటు రెండో పాత్రలో మీరు నటించాలని, మీ పాత్ర న్యారేషన్ వినండి అని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన వంశీ, ప్రత్యేకంగా ఆయనకు కథ వినిపించటం జరిగిందట. 

 

అదే సమయంలో ఎన్టీఆర్ మరో సినిమాతో ఫుల్ బిజీగా ఉండటంతో, ఊపిరి కథ ఎంతో నచ్చినప్పటికీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందట. దానితో ఆ తర్వాత కార్తీని కలిసిన వంశీ పైడిపల్లి, ఆయనతో ఎన్టీఆర్ పాత్ర చేయించారని అప్పట్లో గట్టిగా వార్తలు వచ్చాయి. ఆ విధంగా మంచి హిట్ అందుకున్న ఊపిరి సినిమాలో కార్తి పాత్రలో ఎన్టీఆర్ గనక నటించి ఉంటే, ఆ సినిమా మరొక రేంజ్ సంచలన విజయాన్ని అందుకుని ఉండేదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: