టాలీవుడ్ లో తండ్రి స్టార్ ఇమేజ్ తో నెట్టుకొచ్చే హీరోలు చాలా మంది ఉన్నారు. నటన రాక పోయినా డాన్స్ రాకపోయినా సరే వాళ్లకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. ఒకరిద్దరు మినహా అందరు దాదాపు ఇదే పరిస్థితి. అయితే టాలీవుడ్ లో తండ్రి స్టార్ ఇమేజ్ ఉండి కూడా మంచు మనోజ్ రాణించలేక ఇబ్బంది పడుతున్నాడు. కెరీర్ మొదట్లో కాస్త మంచి సినిమాలు చేసినా ఆ తర్వాత ఎక్కువగా మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని మాస్ సినిమాల మీద ఆసక్తి చూపించాడు. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అతనికి క్రేజ్ వచ్చినట్టే వచ్చి తగ్గిపోయింది. 

 

 దీనితో అతను ఇబ్బంది పడ్డాడు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. అతను ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు రాలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి కారణం అన్నీ కూడా మాస్ సినిమాలను ఎంపిక చేసుకోవడమే. అయితే ఇప్పుడు మంచు మనోజ్ వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అహం బ్రహ్మస్మి  అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ మంచు హీరో సినిమా హిట్ అయితే మంచు మనోజ్ కెరీర్ గాడిలో పడుతుంది.

 

లేదు అంటే మాత్రం అతను ఇక సినిమాల నుంచి తప్పుకోవడమే మంచిదని అభిప్రాయాలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ సినిమా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో వస్తోంది. ఈ మధ్యకాలంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు  మాత్రమే ఇలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటిది మంచు మనోజ్ కెరీర్లో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని చేయాలను కోవటం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం గా మారింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: