సెలబ్రిటీల లైఫ్ ఫుల్ బిజీగా మొన్నటి వరకూ ఉండేది. అయితే ఎప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందో కేంద్రం ‘లాక్ డౌన్’ అమలు చేయటం జరిగిందో బిజీ లైఫ్ కాస్త ఇంటికి పరిమితం అయింది. ఈ సమయంలో చాలా టైం దొరకటంతో అభిమానులతో సోషల్ మీడియాలో అనేక విషయాల గురించి భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్ట్ గురించి సెలెబ్రిటీ లు ముచ్చటిస్తున్నారు. ఇటువంటి సమయంలో సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ షాకింగ్ కామెంట్ లు చేసింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశం పేరు చెప్పి కమిట్మెంట్ అనగా పడుకోవాలని అనేవాళ్ళు ఉన్నారని… ఖచ్చితంగా సినిమా రంగంలో రావాలంటే వాళ్ళు చెప్పినట్లు పడుకోవాలని పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చింది.

 

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫిలిం ఫీల్డ్ లో ప్రతిచోట ఉంటుందని మనకు ఆఫర్ ఇచ్చినా గానీ కమిట్మెంట్ అడిగినా కానీ దానికి ఒప్పుకునేదో లేదో మన ఛాయిస్ బట్టి ఉంటుందని చిత్రాంగద సింగ్ తెలిపింది. తాను మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాటి నుండి తన తో చాలామంది కమిట్మెంట్ కావాలని ఆఫర్ ఇచ్చారని కానీ ఎవరూ ఫోర్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ కోసం టైం కేటాయిస్తున్నట్లు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఓ సినిమాలో అదేవిధంగా అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ‘బాబ్ బిస్వాస్’ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది. చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలో సూర్య హీరోగా నటించిన  'అంజాన్' (తెలుగులో 'సికిందర్') సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: