ఒక చిత్రకారుడు తాను మనసులో ఊహించుకున్న విధంగా బొమ్మలను చిత్రీకరించగలిగాడా లేదా అన్నవిషయం అతడికి మాత్రమే తెలుస్తుంది. ఒక దర్శకుడు ఒక దృశ్యాన్ని తాను అనుకున్నట్లుగా చిత్రీకరించగలిగాడా లేదా అన్న విషయం ఆ దర్శకుడుకు మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా ఒక నృత్య కళాకారిణి ఉపన్యాసకుడు ఆఖరికి ఒక డాక్టర్ తాము తమ వృత్తిలో చేసిన తప్పులు తప్పులు వారికి మాత్రమే తెలుస్తాయి. 


దీనితో వృత్తిలో నిజాయితీ లేకుండా పనులు చేస్తే వాటివల్ల ఫలితాలు ఉండవు అన్న విషయం స్పష్టమవుతోంది. క్వాలిటీ వ్యక్తులకు క్వాలిటీ వస్తువులకు ఎప్పుడు డిమాండ్ ఉండటమే కాకుండా అలాంటి వ్యక్తుల సేవల కోసం ఎక్కువ డబ్బులు చెల్లించడానికి కూడ చాలమంది సిద్ధపడుతూ ఉంటారు. ఒక వృత్తి పట్ల ఒక వ్యక్తి చూపించే నిజాయితీ గురించి మార్టిన్ లూధర్ కింగ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి పని వీధులు ఊడవటమే అయితే ఆ వ్యక్తి ఆ వీధులను బాగా ఊడ్చి పని చేయగలిగితే అతడు ప్రముఖ నాటక రచయిత షేక్స్ పియర్ తో సరిసమానం అంటూ అభిప్రాయపడ్డాడు. 


అంతేకాదు ఒక పని ఎక్కువ మరోకపని తక్కువ అన్న అభిప్రాయం ఎవరికీ ఉండకూడదు అనీ నిబద్ధతతో చేసేపని భగంతుడుకి చేసే పూజతో సమానం అంటూ భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రపంచ నియంతగా పేరు తెచ్చుకుని రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం అయి లక్షలాది మంది మరణానికి కారణం అయిన హిట్లర్ 1930 లో జర్మనీలో నిర్మించిన రోడ్లు ఇప్పటికీ ఆదేశంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే ఒక వ్యక్తి పనిపట్ల నిబద్ధతగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అర్ధం అవుతుంది. 


అందుకే ఏపనిచేసినా మనకంటూ ఒక ముద్ర ఉండాలి అంటారు. ఎంత చేసాము అనేదానికన్నా ఎంత బాగా చేసాము అన్న విషయం పై దృష్టి పెట్టి నిజయితీగా వృత్తి ధర్మాన్ని పాటించే వ్యక్తులు అందరు జీవితంలో ఎదో ఒక సమయంలో ఐశ్వర్య వంతులు అవ్వడం ఖాయం

మరింత సమాచారం తెలుసుకోండి: