హీరోయిన్ గా రేష్మీ చెయ్యాలని చాలా సినిమాల్లో చాలా ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు మాత్రం వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ప్రధానంగా ఆమె చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ కావడం తో ఇక ఆమె యాంకర్ గా మినహా సరిపోయే అవకాశం లేదని కామెంట్స్ చేసారు.  అందుకే ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించాలి అని ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా ఆమెకు అవకాశాలు రాలేదు అనే చెప్పాలి. ఆమె చేసిన సినిమాలు ఏది చూసినా సరే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి గాని ప్రేక్షకులను మాత్రం మెప్పించలేదు అనేది వాస్తవం. 

 

ఇక ఆమె సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాలు అయితే ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి కూడా. ఇక అది అలా ఉంటే ఆమె గుంటూరు టాకీస్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె రోమాన్స్ కూడా చాలా బాగా చేసింది అనేది వాస్తవం. ఆ సినిమాలో ఆమె అందాలు కూడా ఎక్కువగానే చూపించింది. హీరో పక్కన ఆమె కొన్ని సన్నివేశాల్లో రోమాన్స్ లో దాదాపుగా జీవించింది అని చాలా మంది అన్నారు. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు అనే చెప్పాలి. ఆమెకు నటన కూడా రాదని కొందరు కామెంట్ చేసారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే ఆమెకు పెద్దగా అవకాశాలు వచ్చే వాతావరణం లేదని అంటున్నారు. ఆమె స్థానంలో ఎక్కువగా అనసూయ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం అనసూయ టీవీ షోస్ కూడా ఎక్కువగానే చేస్తుంది. ప్రస్తుతం రేష్మీ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఏ సినిమాలో నటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: