నందమూరి వారసుడుగా అభిమనులకు పరిచయమైన  హీరో ఎన్టీఆర్ ...తెలుగులో ఎన్నో  చిత్రాలలో నటించి స్టార్ హీరోగా జనాల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.. తన యాటిట్యూడ్ , టాలెంట్ లతో ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి ఇప్పుడు అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. అందుకే ఇప్పుడు టాప్ హీరోగా చక్రం తిప్పుతున్నారు.. తాతకు తగ్గ మనవడు అంటే ఆ మాత్రం ఉండాలిగా... 

 

 

 

ఇక ఎన్టీఆర్ సినీ కెరీయర్ విషయానికొస్తే... స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసిన అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . 

 

 


ఎన్టీఆర్ సినిమాలలో సినీ అభిమానులకు నచ్చే అంశాలు అంటే అతని జోష్, డ్యాన్స్, డైలాగు డెలివరీ, కామెడీ టైమింగ్, హీరోయిన్లతో ఆయన చేసే రొమాన్స్ , చమత్కారం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ సినిమాలలో ప్రత్యేక అంశాలు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాలలో కడుపుబ్బా నవ్వించిన సినిమా అంటే గుర్తొచ్చేది అదుర్స్ .. ఈ సినిమా రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడు.. అందులో ఒక క్యారక్టర్ బ్రాహ్మణుడు గా, నవ్వుల బ్రహ్మ  బ్రహ్మనందం అసిస్టెంట్ గా కనిపించి ప్రేక్షకులను తన డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తాడు..వీరిద్దరి మధ్య వచ్చే సన్నవేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.. ప్రతికథానాయకుడు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయనున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: