చిరంజీవి తన కెరీర్లో మాస్ కథాంశాలనే ఎక్కువగా చేశారు. అడపాదడపా ఆయన చేసిన క్లాస్ కంటెంట్ మూవీస్ ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ తొలి నాళ్లలో ఆయన చేసిన సినిమాల్లో క్లాస్ కంటెంట్ ఉన్న సినిమా ‘శుభలేఖ’. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న దశలో ఆయన చేసిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. అంతే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. సమాజంలోని సమకాలీన సమస్యపై తెరకెక్కిన ఈ సినిమా విడుదలై 38 ఏళ్లు పూర్తయ్యాయి. శంకరాభరణంతో అంతర్జాతీయ ప్రశంసలు దక్కించుకన్న దర్శకుడు కె.విశ్వనాధ్ ‘శుభలేఖ’ తీశారు

IHG

 

సినిమా 1982 జూన్ 11న విదుదలైంది. ‘కట్నం’ అనే అంశాన్ని తీసుకుని కథ తయారు చేసుకున్నారు. దీనికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద చదువుకున్న యువతీ యువకుల పాత్రలను రాసుకున్నారు. ఈ పాత్రల్లో చిరంజీవి, సుమలత నటించారు. కట్నం తీసుకోవడం నేరం.. చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోయినా గౌరవంగా ఏదైనా ఉద్యోగం చేయొచ్చు అనే పాయింట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అప్పటికే యువ నటుడిగా మంచి మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవికి శుభలేఖ రూపంలో మంచి అవకాశం దక్కింది. సహజసిద్ధమైన నటనతో చిరంజీవి మెప్పించారనే చెప్పాలి. మూర్తి అనే హోటల్ వెయిటర్ పాత్రలో చిరంజీవి నటనకు ఫిలింఫేర్ అవార్దు దక్కింది.

IHG

 

ప్రశాంతి క్రియేషన్స్ బ్యానర్ పై వివి శాస్త్రి, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. కెవి మహదేవన్ సంగీతం ఆకట్టుకుంటుంది. ‘రాగాల పల్లకిలో..’ అనే పాట సూపర్ హిట్ అయింది. గొల్లపూడి మారుతీరావు మాటలు రాశారు. సినిమాలో మంచి పాత్ర చేసిన నటుడు సుధాకర్ ఈ సినిమాతో ‘శుభలేక సుధాకర్’ గా పాపులర్ అయ్యాడు. చిరంజీవి కెరీర్లో ‘శుభలేఖ’ ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: