సూపర్ స్టార్ మహేష్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమా చేస్తే అబ్బో.. ఇద్దరు డ్యాషింగ్ హీరోస్ కలిసి చేస్తే బాక్సాఫీస్ చెడుగుడు గ్యారెంటీ. అనతికాలంలోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే.. అసలీ కాంబినేషనే దుమ్ముదులిపేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే యువ హీరోల్లో విజయ్ దేవరకొండ దూకుడు అందరికి తెలిసిందే. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ దూసుకెళ్తున్నాడు. 

 

మహేష్ దగ్గరకు ఓ క్రేజీ మల్టీస్టారర్ కథ వచ్చిందట. అయితే ఆ సినిమాలో సెకండ్ హీరో పాత్రని విజయ్ దేవరకొండకు రిఫర్ చేశాడట మహేష్. మహేష్ బాబు స్వయంగా రిఫర్ చేశాడంటే అందులో కచ్చితంగా మ్యాటర్ ఉన్నట్టే. అందుకే విజయ్ కూడా ఆ స్టోరీ వినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. కాకపోతే ఈ లాక్ డౌన్ టైంలో వేరే కథలు వినే వీలు కుదరకపోవడంతో మహేష్ చెప్పిన కథ వినలేదట విజయ్.

 

అయితే విజయ్ ఆ కథ విని స్టోరీ నచ్చితే మాత్రం తప్పకుండా మహేష్, విజయ్ కాంబో సెట్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు సూపర్ హిట్ డైరక్టర్ ఈ క్రేజీ కాంబోని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. యువ హీరోల్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటున్న విజయ్ కు ప్రొఫెషనల్ సపోర్ట్ విషయంలో ఇప్పటికే మహేష్ ఎప్పుడు వెంట ఉండగా ఇప్పుడు మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మహేష్ స్వయంగా నిర్మిస్తాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అసలు విషయం తెలియాల్సిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులుగా రానున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: