అయితే టబు ఎక్కువగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటించిన విషయం తెలిసిందే. గ్లామరస్ పాత్రల్లో నటించినప్పటికీ వాటికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పాలి. అందాల ఆరబోతకు తక్కువగా ప్రాధాన్యతనిస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న వైవిద్యాత్మకమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. పాత్రకు తగ్గట్టుగా అభినయం హావభావాలు నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది నిన్నటితరం హీరోయిన్ టబు.
ఎలాంటి పాత్రలో అయిన తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది, ఓ వైపు తన అభినయంతో ఆకట్టుకుంటూనే నటిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించింది. అంతేకాదు ఉత్తమ నటిగా టబు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఇలా తన నటనతో ఎంతోమందిని మెప్పించి తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించింది నిన్నటితరం హీరోయిన్ టబు. దాదాపు స్టార్ హీరోలందరి సరసనా నటించి చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తన హవాని నడిపింపించింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠ పురములో సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించిన టబు మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పాలి.
Powered by Froala Editor