స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ కాంబినేషన్లో సినిమా వస్తుంటే అభిమానులు, బిజినెస్ సర్కిల్స్ లో అంచనాలు పెరిగిపోతాయి. టాలీవుడ్ లో అటువంటి సంచలనాలు నమోదు చేయగలిగే కెపాసిటీ పవన్ కల్యాణ్పూరి జగన్నాధ్ కాంబోకు ఉంది. పూరి కెరీర్ పవన్ ‘బద్రి’తో స్టార్ట్ అయింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మరింతగా ఎదిగిపోయారు. దీంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా కోసం అభిమానులే కాదు.. ఇండస్ట్రీనే ఎదురు చూసింది. 12 ఏళ్ల తర్వాత వీరిద్దరూ చేసిన మరో సినిమానే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ సినిమా విడుదలై నేటికి 8 ఏళ్లు పూర్తయ్యాయి.


భారీ అంచనాలతో అక్టోబర్ 18, 2012న విడుదలైందీ సినిమా. అప్పటికి ఎంటర్ టైన్మెంట్ పరిధి దాటి సమాజంలోని సమస్యలపై సినిమాలు తీసే స్థాయికి వీరిద్దరూ ఎదిగారు. ఆ నేపథ్యంలోనే సామాన్యుడి కోపం, జర్నలిజం పవర్, వ్యవస్థల్లోని లోపాల్ని.. ఈ సినిమాలో చూపించాడు పూరి. ప్రజల్ని జాగృతి చేసే పాత్రలో, జర్నలిస్టుగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో చేసి సినిమా స్థాయిని పెంచాడు. దీంతో సమాజానికి అవసరమైన సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. పూరి మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్, పవన్ మెస్మరైజింగ్ యాక్టింగ్ సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టాయి.



సినిమాలో మణిశర్మ అందించిన పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. యూనివర్శల్ మీడియా బ్యానర్ పై రాధాకృష్ణ, డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మించారు. క్లైమాక్స్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. అయితే.. గబ్బర్ సింగ్ వంటి భారీ ఎంటర్ టైన్మెంట్ తర్వాత పవన్ సినిమాను ఆస్థాయిలోనే ఊహించారు ఫ్యాన్స్. పైగా పూరి జగన్నాధ్ దర్శకుడు. మంచి సినిమాగా ప్రేక్షకాదరణ దక్కినా భారీ అంచనాలు సినిమా ఫలితంపై కాస్త ప్రభావం చూపాయని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: