పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ‘వకీల్ సాబ్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్న ఈ మూవీతో పవన్ మళ్ళీ బౌన్సు బ్యాక్ అవుతాడని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా పవన్ కు సంబంధించి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న లేటెస్ట్ ఫోటోలను చూసి పవర్ స్టార్ అభిమానులు భయపడి పోతున్నట్లు తెలుస్తోంది.


సాధారణంగా టాప్ హీరోలు  తమ వయసును బయట పడనీయకుండా జుత్తుకు రంగు అవసరం అనుకుంటే విగ్గు పెట్టుకుంటూ ఉంటారు.  అయితే పవన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సహజంగా తనని తాను  ఆవిష్కరించుకునేందుకే ప్రయత్నిస్తున్నాడా అంటూ అతడి అభిమానులు  కలవర పడుతున్నారు. లేటెస్ట్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న పవన్ ఫోటో చూశాక అభిమానులు అదిరిపోతున్నారు.  


ఒక వైపు ‘వకీల్ సాబ్’  షూటింగ్ కు రెడీ అవుతూ ఆతరువాత వరసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ ఇలా ఒక యోగిలా మారిపోతే ఎలా అని కలవర పడుతున్నారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ తన దీక్షను ముగించి ఈనెల 25 నుంచి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లోపాల్గొనబోతున్నాడు. ఆ సమయానికి పవన్ తన గుబురు గడ్డం నుండి బయట కు వచ్చినా ముఖంలో గ్లౌ లేక పోతే ఏమిటి అని పవన్ అభిమానుల భయం.  


ఇది ఇలా ఉండగా ‘వకీల్ సాబ్ మూవీ’  చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభం అయింది. పవన్ సెట్ లోకి అడుగు పెట్టకపోయిన అంజలి నివేదా థామస్ ప్రకాష్ రాజ్ ల పై కీలక సన్నివేశాలు చిత్రీక రిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించి మరింత హైక్ ను పెంచడానికి ఈమూవీకి సంబంధించిన కీలక షాట్ లతో టీజర్ ని అదిరిపోయే రేంజ్ లో సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రయత్నాలు అన్ని బాగునా పవన్ లుక్ లో గ్లౌ లేకపోతే ఎన్నిచేసినా ప్రయోజనం ఏమిటి అన్నది పవన్ అభిమానుల భయం..


మరింత సమాచారం తెలుసుకోండి: