టాలీవుడ్ హీరోలే కాదు మన దర్శకులు కూడా ...బాలీవుడ్ ఫిలింస్ ను టేకప్ చేస్తున్నారు. అనుకున్న దానికంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. బీటౌన్ లోనూ జెండా ఎగరేస్తున్నారు తెలుగు దర్శకులు.

తెలుగు సినిమాల దర్శకులు సొంత కంటెంట్ లతో సంతృప్తి చెందలేకపోతున్నారు. జాతీయస్థాయిలో తమ పేరును చూసుకోవాలనుకుంటున్నారు. అందుల్లో భాగంగా కుదిరితే ముంబయి ఎక్స్ ప్రెస్ ఎక్కేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ట్రెండ్ లో ఉన్న దర్శకులలో మనకు క్రిష్ కనిపిస్తాడు. ఠాగూర్ రీమేక్ తో పాటు మణికర్ణిక సినిమా హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.

క్రిష్ తో తెలుగు దర్శకులకు వచ్చిన గుర్తింపును రిఫరెన్స్ గా తీసుకుని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా బీటౌన్ సినిమా చేశాడు. అదే కబీర్ సింగ్ .అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ గా నిలిచి...బాలీవుడ్ ఫిలిం సర్కిల్ లో తెలుగు దర్శకుడి సత్తాను ఎలివేట్ చేసింది.

తాజాగా వీరిద్దరిని ఆదర్శంగా చేసుకొని పిల్ల జమిందార్ ఫేం జి.అశోక్  బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు. తన లేటెస్ట్ హిట్ భాగమతి సినిమాను హిందీలో భూమి ప‌డ్నేక‌ర్ ప్రధాన పాత్రలో దుర్గావ‌తి పేరుతో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, అగ్ర నిర్మాత భూష‌ణ్ కుమార్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌డం విశేషం.

దుర్గావతి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే డైరెక్టర్  అశోక్ కు బాలీవుడ్లో మ‌రో ఛాన్స్ వచ్చింది." ఉఫ్" పేరుతో అత‌ను అక్కడ ప్రయోగాత్మకంగా ఓ సైలెంట్ మూవీ చేయ‌బోతున్నాడు. నుష్రత్ బ‌రూచా, నోరా ఫ‌తేహి, సోహ‌మ్ షా ఇందులో ప్రధాన పాత్రలు పోషించ‌నున్నారు. ప్రముఖ ద‌ర్శకుడు ల‌వ్ రంజ‌న్ ఈ ఫిలింను  నిర్మిస్తుండటం  విశేషం. మొత్తానికి మన దర్శకులకు బాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు. తమ టాలెంట్ ఇండియా వైడ్ గా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: