బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ ఎప్పుడూ వివాదాలకు తావుతీస్తానే ఉంటాయి. అయితే వెబ్ సిరీస్‌లకు సెన్సార్ ఉండదు. దాంతో కొన్ని పచ్చిగానే చూపిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కాంట్రవర్సీ అయింది. డక్ ఫేమ్ ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా మీరా నాయర్ దర్శకత్వంలో నటించిన వెబ్ సిరీస్ 'ఎ సూటబుల్‌ బాయ్‌'. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటించింది. ఈమె సైదా బాయి అనే వేశ్య పాత్రలో నటించింది. దీంతో ఈ వెబ్ సిరీస్ భారీ అంచనాలతోనే విడుదలైంది. ఎప్పుడో నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదంతో చిక్కుకుంది.

అయితే ‘ఎ సూటబుల్ బాయ్' సిరీస్‌లో కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వివాదంలో ఇరుక్కుపోయాయి. అందులో హీరోయిన్ తన ముస్లిం లవర్‌తో హిందూ ఆలయంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దీనిపై బీజేపీ నేత గౌరవ్ గోయల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సన్నివేశాలను వెంటనే తొలగించకపోతే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు నెట్ ఫ్లిక్స్‌తో పాటు ఈ సిరీస్ దర్శక నిర్మాత మీరా నాయర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని రేవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు గౌరవ్. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు తన మొబైల్ నుంచి నెట్ ఫ్లిక్స్ యాప్‌ను తొలగిస్తూ 'బాయికాట్ నెట్ ఫ్లిక్స్' హ్యాష్ ట్యాగ్‌తో ఓ పోస్టు చేసాడు ఈయన.



ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. దీంతో ఆ రాష్ట్ర ఎంపీ నరోత్తం మిశ్రా కూడా స్పందించారు. ఈ సీన్లను పరిశీలించాలని.. అవి అభ్యంతరకరంగా ఉన్నట్లయితే వెంటనే నెట్ ఫ్లిక్స్‌తో పాటు సిరీస్ వెబ్ సిరీస్ మేకర్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపాడు. గతేడాది సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సిరీస్ షూటింగ్‌ ఎక్కువ భాగం లక్నో నగరంలోని రాజభవనాలతో పాటు మధ్యప్రదేశ్ మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇందులో టబు, ఇషాన్ ఖట్టర్ మధ్య వచ్చే ఇంటిమేట్ సన్నివేశాలు కూడా వివాదానికి దారి తీశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: