తెలుగు సినిమాలో హీరోయిన్ అందంగా ఉండాలి. అంతే కాదు, వాటిని ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. మన  తెలుగు సినిమాలలో హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాల్స్ గానే చూస్తున్నారు. దాంతో కంటెంట్ వీక్ గా ఉన్నా కూడా హీరోయిన్స్ గ్లామర్ డోస్ తో బండి లాగించే సినిమాలే ఎక్కువగా ఉంటాయి.

ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే కధ మీదనే పూర్తిగా  కూర్చుంటారు. అది కూడా హీరో చుట్టూనే కధ తిరుగుతుంది. దాంతో హీరోయిన్స్ జస్ట్ ఫర్ రిలాక్సేషన్  అన్నట్లుగా ఆటపాటలతోనే టైం పాస్ గా ఉంటుంది. బాలయ్య లాంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్ కి ఇంపార్టన్స్ తక్కువే. బాలయ్య సినిమా మొత్తం కనిపిస్తున్నారు.  భారీగా డైలాగ్స్ ఉంటాయి. ఇక బోయపాటి లాంటి వారు ఈ మూవీని హ్యాండిల్ చేస్తే యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా బిగ్ సౌండ్ చేస్తుంది.

ఇక బోయపాటి బాలయ్య ముచ్చటగా మూడవ సినిమా చేస్తున్నారు. ఆ మూవీకి మోనార్క్ అన్న టైటిల్ కూడా దాదాపుగా ఫిక్స్ చేశారు. హీరోయిన్స్ ప్రాబ్లం మొదటి నుంచి ఈ మూవీకి ఉంది. అయితే ఇపుడు అది కూడా  తీరిపోయింది. మంచికో చెడ్డకో చాలా మంది హీరోయిన్స్  పేర్లు  తెర మీదకు వచ్చినా చివరి నిముషంలోవారు  తప్పుకోవడం సినిమాకు ప్లస్ అయిందని అనుకుంటున్నారుట.

ప్రగ్యా జైస్వాల్ ఇపుడు బాలయ్య  పక్కన నటిస్తోంది. ఈ అమ్మడు గ్లామర్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. దానికి తోడు ఆమె తన హాట్ హాట్ ఫోటోస్ ని ఎప్పటికపుడు మీడియాకు రిలీజ్ చేసి యూత్ కి కేక పుట్టిస్తోంది. అలా లైం లైట్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ ను ఈ మూవీలోకి తీసుకోవడం ద్వారా మంచి పనే చేశారు అని వినిపిస్తోంది.

బాలయ్య ప్రగ్యా జోడీ బాగానే  ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి బోయపాటి సినిమాల్లో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దానికి తగిన హీరోయిన్ గానీ  ప్రగ్యా కుదిరిందని అంటున్నారుట. మరి ఆమెతో ఆడి పాడి బాలయ్య ఫ్యాన్స్ ని ఎలా అలరిస్తారో వెండి తెర మీద చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: