90'స్ లో తమిళ్ ఇండస్ట్రీ లో హీరో ప్రశాంత్ ఒక పెద్ద సంచలనం. ఐశ్వర్య రాయ్ వంటి హీరోయిన్ తో జీన్స్ చిత్రం కి నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రశాంత్. చూడటానికి ఆరడుగుల ఆజానుబాహుడు, ఎంతో అందగాడు కావడంతో ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉండేది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ప్రశాంత్ మొదటగా రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో చామంతి అనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. మణి రత్నం సినిమా దొంగ దొంగ లో నటించి తన ఖాతాలో వరస హిట్స్ వేసుకున్నాడు. ఇలా హిట్స్ కొడుతున్న నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో జీన్స్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇదే ప్రశాంత్ కెరీర్ ని అమాంతం పెంచింది. ఇక తెలుగులో సైతం లాఠీ, ప్రేమ శిఖరం, సాహసం వంటి స్ట్రెయిట్ సినిమాల్లో నటించాడు.

కెరీర్, పర్సనల్ లైఫ్ .. ఫ్లాప్

ఇక ప్రశాంత్ ఎన్ని హిట్ సినిమాల్లో నడిచిన ఆయనకు కావాల్సినంత పేరు మాత్రం రాలేదు. అలాగే ఒకానొక సమయంలో స్టార్ నుండి సూపర్ స్టార్ గా ఎదగలేక చతికిల పడ్డాడు. అందుకు కారణం ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్. కొడుకుకు సంబందించిన డేట్స్ ని, రెమ్యునరేషన్ ని త్యాగరాజన్ డిసైడ్ చేసేవాడు. ఒక సినిమా ఏదైనా హిట్ అయ్యింది అంటే ప్రశాంత్ రేటు బాగా పెంచేవాడు త్యాగరాజన్. దర్శక నిర్మాతలకు ప్రశాంత్ ని నేరుగా కలిసే అవకాశం వచ్చేది కాదు. అలా ప్రశాంత్ కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. ఇక వ్యక్తిగత జీవితం సైతం ప్రశాంత్ అస్తవ్యస్తంగా మారింది. గజలక్ష్మి అనే అమ్మాయితో వివాహం కాగా త్యాగరాజన్ వల్ల గొడవలు పడి అవి పెరిగి పాకాన పడటంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో వినేయ విధేయ రామ వంటి సినిమాతో ప్రశాంత్ రిఎంట్రీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: