ఎంతో మంది నటులు పెద్దగా సపోర్టు లేకుండానే తమ స్వయంకృషితో సంకల్ప బలంతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో తమిళ హీరో అజిత్ కుమార్ కూడా ఒకరు. సినిమాల్లోకి రాకముందు అజిత్ బైక్ మెకానిక్ గా కూడా పని చేశారు. ఎన్ వీడు ఎన్ కన్వర్ అనే తమిళ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 1990 లో ప్రేక్షకులకు పరిచయం అయిన అజిత్ కుమార్... ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కి చేరుకున్నారు. 1993లో ప్రేమ పుస్తకం సినిమాతో హీరోగా మారాడు అజిత్. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. ఇక ఆ తర్వాత అజిత్ వెనక్కి తిరిగి చూసింది లేదు. అజిత్ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. చదువులోనూ నెంబర్ వన్.

మన అదృష్టం మరియు మనం పడే కష్టాన్ని బట్టి మనకు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. కానీ ఎంతోమంది పేదలు తినడానికి తిండి లేక... టాలెంట్ ఉన్నా చదువుకోడానికి స్తోమత లేక అల్లాడుతున్నారు. డబ్బులు ఉండడం గొప్ప కాదు... ఇలాంటి వారికి సహాయం చేసినప్పుడే ఆ డబ్బు విలువతో పాటు సాయం చేసిన వ్యక్తి విలువ కూడా మరింత పెరుగుతుంది. ఇలాంటి వారిని చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. వారిలో ముందుంటారు హీరో అజిత్ కుమార్. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోగా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు దూసుకు పోతున్నారు ఈ హీరో. మొదటినుంచి సాయం చేసే గుణం మెండుగా ఉన్న ఈ హీరో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. తరచు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు వీలైనంత చేస్తుంటారు.

అయితే తాజాగా మరో చేతికి సాయం చేశాడు అజిత్...ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘వాలిమై’ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే జరుపుకొంది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు తన సిబ్బందికి కూడా తెలియకుండా బయటికి వచ్చి అలా రోడ్లపై షికార్లు కొట్టే వారు అజిత్. ఆ క్రమంలో ఓ ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ తింటున్న అజిత్ఇడ్లీ అమ్మే వ్యక్తి యోగ క్షేమాల గురించి తెలుసుకున్నాడు అజిత్. అతను పేదరికంలో మగ్గిపోతున్నారు అన్న విషయం తెలుసుకున్న అజిత్ మనసు కరిగిపోయింది. ఇడ్లీ బండి వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చి సాయం చేశాడు అజిత్. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ హీరో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: