ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ ఆర్ ఆర్‌. బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. బాహుబలి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గాయాల పాల‌వ్వ‌డంతో ఇప్ప‌టికే రెండు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది. ఇక క‌రోనా దెబ్బ‌తో ఈ సినిమా ప్లానింగ్ అంతా త‌ల క్రిందులు అయ్యింది.

ఆరు నెల‌ల పాటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్ ఎలాంటి ప‌నీ లేకుండా ఖాళీగా కూర్చోవాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. గత అక్టోబరులో షూటింగ్ పున:ప్రారంభించి విరామం లేకుండా చిత్రీకరణ సాగిస్తున్నారు. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంద‌ని.. 2021లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంద‌ని చెపుతున్నారు. వాస్త‌వానికి రాజ‌మౌళి ప్ర‌తి సీన్ విష‌యంలో చాలా టైమ్ తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఈ యేడాది ఉండ‌క పోవ‌చ్చ‌ని 2022 సంక్రాంతికే ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి అప్పుడే క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంద‌ని చెప్ప‌డంతో ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఈ యేడాదే రిలీజ్ అవుతుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు. ఏదైనా మ‌రో ఆప‌త్క‌ర ప‌రిస్థితి వ‌స్తే త‌ప్పా ఆర్ ఆర్ ఆర్‌ను ఈ యేడాదే థియేట‌ర్ల‌లో వీక్షించ‌వ‌చ్చు. ఏదేమైనా ఆర్.ఆర్.ఆర్ కోసం రెండు సంవ‌త్స‌రాలుగా ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న వాళ్ల‌కు రాజ‌మౌళి క్లైమాక్స్ స్టార్ట్ అయ్యింద‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో కొత్త ఆశ‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి కోట్లాది మంది ప్రేక్ష‌కుల క‌ల‌ను రాజ‌మౌళి 2021లోనే తీరుస్తాడేమో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: