టాలీవుడ్ లో రామ్ గోపాల వర్మ సంచలన దర్శకుడు. అంతే కాదు వివాదాస్పద దర్శకుడు. వర్మ ఏ విషయం అయినా లాజిక్ తో మాట్లాడుతాడు. ఆయన సినిమాలు కూడా లాజిక్ తోనే తీస్తారు. కానీ సినిమాకు కావల్సినది లాజిక్ కాదు, కాల్పనికత. అందుకేనేమో వర్మ సినిమాలు కొన్ని ఆడడంలేదని అంటారు.

ఇవన్నీ ఇలా ఉంటే తెలుగు చలన చిత్ర సీమలో దాసరి నారాయణరావు తరువాత  రామ్ గోపాల్ వర్మ ఎక్కువ మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన శిష్యులు చాలా మంది సినిమా పరిశ్రమలో నలు చెరగులా ఉన్నారు. ఇక అందులో ఒక శిష్యుడు జేడీ చక్రవర్తి. జేడీ అనగానే గులాబీ మూవీ గుర్తుకు వస్తుంది. ఈ మూవీ 1995లో   రిలీజ్ అయి అదరగొట్టింది.

అలాగే అనగనగ ఒక రోజు, సత్య లాంటి మూవీస్ తో జేడీ టాప్ లెవెల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్స్ ఆయన్ని వెనక్కు లాగేశాయి. ఇక జేడీ కొన్ని సినిమాలను డైరెక్షన్ చేశాడు, మరి కొన్ని సినిమాలను చేయబోతున్నాడు. ఇపుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే జేడీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. దానికి నిర్మాత మాత్రం రామ్ గోపాల్ వర్మట.

ఆర్జీవీ త్వరలో నిర్మించబోయే సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నట్లుగా జేడీ చక్రవర్తి తాజాగా చెప్పుకొచ్చాడు. మరి జేడీ, రామ్  గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చినవాడే. దాంతో జేడీ మూవీ ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే ఉంది. జేడీ ఆర్జీవీ సినిమాతో పాటు తాను సొంతంగా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తానని చెప్పుకొస్తున్నాడు. మరి జేడీ ఫామ్ లోకి వస్తే ఆయన టాలెంట్ తో కొన్ని కొత్త జానర్ సినిమాలను టాలీవుడ్ టేస్ట్ చేస్తుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక జేడీ తాజాగా నటించిన చిత్రం ‘ఎంఎంఓఎఫ్’ పేరుతో ఈ రోజు విడుదల కాబోతోంది. మొత్తానికి జేడీ మళ్లీ బిజీ అవుతున్నాడు. అటు నటుడిగా, ఇటు డైరెక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: