ఫిదా సినిమా చాలా బాగుంటుంది. ఎన్ని సార్లు టీవీలో వచ్చిన వ్యూయర్ షిప్  కి ఢోకా ఉండదు, పైగా ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగిపోతునే ఉంటారు. దానికి కారణం ఆ సబ్జెక్ట్ లో ఉన్న ఫ్రెష్ నెస్ అలాంటిది. ప్రేమ కధ. దాని వెనక ఒక ఆత్మ విశ్వాసం మెండుగా గల భానుమతి కధ.  అవును భానుమతి ఓన్లీ వన్ పీస్.

ఫిదా మూవీ కధ, కధనాలు ఎంత బాగుంటాయో వాటితో పాటే సాయి పల్లవి నటన కూడా చూడ చక్కగా ఉంటుంది. ఫిదా మూవీలో సాయి పల్లవి నటనకు ఫిదా కాని వారు ఉండరంటే ఉండరు. ఈ మూవీలో ఎంతో మంది ఉన్నా సెంటర్ పాయింట్ మాత్రం సాయి పల్లవి. ఆ విధంగా  తన నటనా పటిమలో ఫిదాను సూపర్ డూపర్ హిట్ చేసి పారేసిన సాయి పల్లవి ఇపుడు అదే శేఖర్ కమ్ముల కాంబోలో లవ్ స్టోరీ అంటూ వస్తోంది.

ఇందులో హీరో అక్కినేని నాగ చైతన్య. అయినా సరే ఎక్కువగా జనాలు సాయి పల్లవి మీదనే ఫోకస్ పెడుతున్నారు. దానికి కారణం ఫిదా సూపర్ హిట్ కావడం, ఆ మూవీ తాలుకా ప్రభావం జనాల మీద ఇప్పటికీ చెదిరిపోకుండా ఉండడం. ఫిదా మూవీ తరువాత సాయి పల్లవి చాలా సినిమాలు చేసింది కానీ ఆమెలోని నటనను ఆ స్థాయిలో చూపించే మూవీ రాలేదు అన్న అసంతృప్తి ఆడ్యియన్స్ లో ఉంది. దాన్ని భర్తీ చేయడానికా అన్నట్లుగా శెఖర్ కమ్ముల మళ్ళీ లవ్ స్టోరీ తీశాడు అంటున్నారు. ఈ మూవీ లో సాంగ్స్ చూసినా, పోస్టర్లు చూసినా మోస్ట్ అవేయింట్ మూవీ ఇదేనని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ మూవీ ఏప్రిల్ నెల మూడవ వారంలో వస్తోంది. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ రెడీ. అంతే కాదు హిట్ చేయడానికి కొడా రెడీ. మొత్తానికి సాయి పల్లవి ఈ సారి ఏ పేరుతో ఈ మూవీలో ఆకట్టుకుంటుందా  అన్న డిస్కషన్ అయితే చాలానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: