తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్ట్‌ నుంచి టీమీడింయా ఫాస్ట్‌‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైదొలగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నాను అని బుమ్రా ప్రకటించినప్పటికి.. పెళ్లి చేసుకోవడం కోసమే మ్యాచ్‌కు దూరమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరగుతోంది‌. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారం అవుతోంది.

ఇక మరోవైపు, అనుపమ రాజ్ కోట్ వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి కోసమే అక్కడికి వెళ్లిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బుమ్రా కూడా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడని గుజరాత్‌ వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీని గురించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం అవుతోంది.

అంతేకాక బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అలానే క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని అనుపమ పరమేశ్వరన్‌ గతంలో బహిరంగంగానే ప్రకటించింది‌. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ బయట కలుసుకున్నట్లు కానీ.. కలిసి ఫోటోలు దిగినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. అలాంటిది ఒక్కసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. మరి ఇవి ఎంత వరకు వాస్తవమో చూడాలి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: