ఉప్పెన సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ  ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ కలెక్షన్ల గురించే అతి పెద్ద చర్చగా పెడుతున్నారు. ఎందుకిలాఈ మూవీ  ఆడేస్తోంది. ఈ సినిమాలో ఏముంది అని మరో వైపు చర్చ. అయితే ఏమీ లేకపోతే సినిమా ఆడదు కదా. కలెక్షన్లు  ఉప్పెనగా దూసుకురావు కదా అన్నది కూడా ఓ చర్చ.

అంటే కొన్ని సినిమాలు అలా వచ్చీ పోతూ ఉంటాయీ. హిట్టు అయింది అని మేకర్స్ మాత్రమే చెప్పుకుంటారు. కొన్ని మీడియా హైప్ తో హిట్ అన్న టాక్ తెచ్చుకుంటాయి. కానీ ఉప్పెన లాంటి సినిమాలు అంతా ఒక్కటిగా ఏకగ్రీవంగా సూపర్ హిట్ అని టాక్ తెచ్చుకునే రేంజిలో ఉంటాయి. ఒక కొత్త హీరో కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్ చేసిన మ్యాజిక్ కి జనం ఫిదా అయ్యారు. మూడు వారాలు తిరిగేసరికి లాభాలు అదరగొట్టే స్థాయిలో వచ్చాయి అంటే ఉప్పెన మూవీ ఎలాంటి హిట్ అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన కేవలం 21 రోజులకే యాభై కోట్ల రూపాయలు వసూల్ చేసిన్ టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది. మొదటి సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు రావడం అంటే వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడనే అంతా చెబుతున్నారు.

ఒకే ఒక్క సినిమా జాతకం మొత్తం మార్చేసింది. ఇక ఉప్పెన గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. టాలీవుడ్ ఇపుడు నానా రకాలైన ఇబ్బందులో ఉంది, ఒక ఏడాది అంతా కరోనా వల్ల సర్వనాశనమై రూపాయి కూడా కళ్ళ చూడని పరిస్థితి. దాంతో 2021లో అతి పెద్ద హిట్ తో ఉప్పెన కలకలమే రేపింది అని చెప్పాలి. అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో కరోనా క్రైసిస్ నుంచి టాలీవుడ్ ని బయటపడేశాడూ అంటే అది సంచలనమే కదా. మొత్తానికి టాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలకు ప్లేస్ ఉంటే అందులో కొత్తగా వచ్చి చేరిన మూవీ ఉప్పెన అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: