టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రుతిహాసన్..  విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ నట వారసురాలు అయినప్పటికీ తండ్రి బ్యాగ్రౌండ్‌ని ఉపయోగించకుండా స్వశక్తితో ఎదుగుతోంది శ్రుతిహాసన్.. మొదటి నుంచి ఆమె ఇండిపెడెంట్‌గానే ముందుకెళ్తున్నారు. మంగళవారం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ''నాకు సహాయం చేయడానికి అమ్మానాన్న లేరు. అంటే నేను వారి మీద ఆధారపడలేదని అర్ధం. నా కళ్ల మీద నిలబడటానికే ఎప్పుడూ ప్రయత్నిస్తా. నా ఖర్చులకి నేనే సంపాదించుకుంటా.

నా కుటుంబ సభ్యుల నుంచి ఏమీ ఆశించను, అడగను. నా బిల్లులు చెల్లించుకోవాలంటే నేను పని చేయాల్సిందే! లేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాలి. గతంలో కూడా నాకు ఇవన్నీ అనుభవమే! కరోనాకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందనే దానికోసం నేను వెయిట్‌ చేయను.నేను పని చేస్తున్న ప్రాజెక్ట్‌ల నుంచి ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు నేను షూటింగ్‌కి వెళ్లాల్సిందే! అందరిలాగే నాకు ఇబ్బందులున్నాయి. అందుకే పని చేసి తీరాలి. నా వ్యక్తిగత, వృతి పరమన నిర్ణయాలు నేను తీసుకుంటా. ఎవరి సలహాలు తీసుకోను. కరోనా కారణంగా నష్టాల్లో ఉన్నామంటూ స్మార్ట్‌ పీపుల్‌ చాలామంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు.

 నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతా'' అని శ్రుతీ తెలిపారు. అయితే ఉన్నట్టుండి శ్రుతీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇటీవల సక్సెస్‌ అయిన 'వకీల్‌ సాబ్‌'లో పవన్‌కు భార్యగా నటించిన ఆమె ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌ తో పాటూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని హోంబలే ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: