ప్రస్తుతం బాలీవుడ్ లో మైథలాజికల్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు మేకర్స్. ఈ రకమైన ట్రెండ్ ఇప్పటికీ బాలీవుడ్లో మొదలవగా చాలా మంది హీరోలు ఇతిహాసం నేపథ్యంలో కథను చేయడానికి దర్శకులపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఇతిహాస నేపథ్యంలోనీ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాహుబలి సినిమా తో దేశవ్యాప్తం గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఆయన హీరోగా బాలీవుడ్ లో రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో సీతగా కృతిసనన్ , రావణాసురుడు గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే రామసేతు సినిమా కూడా రామాయణ ఇతిహాస నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో పురావస్తు శాఖ అధికారిగా కనిపిస్తుండగా జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా నిర్మాణంలో తొలిసారి పాలు పంచుకుంటుంది. మహాభారతంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అశ్వద్ధామ. ఈయన కథాంశంతో విక్కీ కౌశల్ అశ్వత్థామ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ద్రోణాచార్యుడు కుమారుడిగా అశ్వద్ధామకు మహాభారతంలో ఒక పెద్ద చరిత్రే ఉంది. అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తీవారి దర్శకత్వంలో రామాయణం  త్రీడీలో తెరకెక్కుతుంది.మధు మంతెన, నమిత్‌ మల్హోత్ర లు ఇతర నిర్మాతలు.  శ్రీరాముడు సతీమణి సీత కథతో కూడా కరీనా కపూర్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ద్రౌపది, అపరాజిత అయోధ్య వంటి బాలీవుడ్ లో తెరకెక్కే చిత్రాలు కూడా మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: