తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చాలా మంది హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. మన టాలీవుడ్ హీరోలే కాకుండా ఇతర భాషల హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేసి, వారి సినిమాలు తెలుగులో డబ్ చేసి  సూపర్ హిట్ కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారి సినిమాలు హిట్ కావడంతో వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడుతుంది తెలుగునాట. అలా ఇతర భాషల నుంచి వచ్చి తెలుగు లో ప్రేక్షకుల మదిని గెలుచుకున్న హీరోలు వారి సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం.

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య మొదట్లో యువ, గజిని సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి తెలుగునాట మంచి క్రేజ్ ను ఏర్పర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో వచ్చేలా చేసుకుంటూ తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు. కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఉపేంద్ర కూడా రా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై కొద్ది కాలంలోనే మంచి అభిమానాన్ని అందుకున్నాడు. రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ గురించి చెప్పనవసరం లేదు. రఘువరన్ బీటెక్ సినిమా ను తెలుగులో డబ్బింగ్ చేసి మంచి హిట్ కొట్టి టాలీవుడ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

రంగం సినిమాతో హీరో జీవా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత తన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం తో ప్రేక్షకులను అలరించి మహానటి సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగు సినిమా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సూర్య తమ్ముడు కార్తీ యుగానికొక్కడు, ఆవారా సినిమాలతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు తెలుగులోని స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. శివ కార్తికేయన్ రేమో సినిమా తో, విక్రమ్ శివ పుత్రుడు సినిమా తో, విజయ్ దళపతి తుపాకి సినిమాతో, విజయ్ సేతుపతి ఫిజ్జా సినిమా తో ,విశాల్ పందెంకోడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: