టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ అంటే అందరు చెప్పే పేరు ఒకటే ఆయనే విక్టరీ వెంకటేష్. వెంకీ డైరెక్ట్ కథలతో తీసిన సినిమాలకు ఈక్వల్ గా రీమేక్ సినిమాలు ఉన్నాయని చెప్పొచ్చు. వెంకటేష్ 73 సినిమాల ప్రస్థానంలో చాలా వరకు ఏదో ఒక భషలో హిట్టైన సినిమాలను ఇక్కడ రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రీమేక్ చేసినా వెంకటేష్ తన మార్క్ మిస్ అవనివ్వడు.

హిట్టైన ప్రతి సినిమా రీమేక్ చేయడం కాదు తనకు సూట్ అయ్యే కథనే ఎంచుకుంటాడు. అందులో తన పాత్ర తీరుతెన్నులు బాగా డెవలప్ చేయించుకుని తెలుగులో రీమేక్ అయినా అసలు మాత్రుక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ మామ స్టైల్ అని చెబుతుంటారు. కొన్ని సినిమాలు మాత్రుక సినిమాల కన్నా ఎక్కువ విజయం అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇతర భషలో డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఏదైనా సినిమా హిట్ అనిపించుకుంది అంటే దాన్ని తెలుగు ఆడియెన్స్ కు అందించాలనే ఉద్దేశ్యంతో వెంకటేష్ రీమేక్ సినిమాలు చేస్తుంటాడు.

ప్రస్తుతం వెంకటేష్ నారప్ప, దృశ్యం 2 సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. రెండు డిఫరెంట్ సబ్జెక్టులు అయినా కూడా తన ఆహార్యం మార్చుకుని సినిమా కథకు ఎలా కావాలో అలా తనని తాను మార్చుకుని చేస్తున్నాడు. ధనుష్ చేసిన అసురన్ సూపర్ హిట్ కాగా ఆ సినిమా రీమేక్ గా వస్తున్న నారప్ప సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాలని చూస్తున్నాడు విక్టరీ వెంకటేష్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం నారప్ప సినిమాలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. తప్పకుండా తమిళంలో అసురన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో నారప్ప కూడా అంతే ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సెన్సిబుల్ డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: