కొత్త బంగారులోకం నుండి బ్రహ్మోత్సవం వరకు డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల తీసిన నాలుగు సినిమాలు సెన్సిటివ్ కథలతో తెరకెక్కించాడు. అయితే తమిళ అసురన్ రీమేక్ నారప్పతో తన ఫార్మెట్ చేంజ్ చేశాడు డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల. సెన్సిబుల్ స్టోరీస్ తో మెప్పించిన శ్రీకాంత్ అడ్డాల నారప్పతో తనలోని మరో యాంగిల్ చూపించాడు. డైరక్టర్ గా నారప్ప కొత్త వర్షన్ చూపించాడు. శ్రీకాంత్ అడ్డాల అంటే ఇదివరకు మనసుకి హత్తుకునే కథలు.. మనసుని కదిలించే మాటలు గుర్తొస్తాయి ఆయన కూడా వయిలెన్స్ లోకి దిగేశాడు.

అసురన్ రీమేక్ ఛాన్స్ శ్రీకాంత్ అడ్డాలకి ఇచ్చినప్పుడు ప్రేక్షకుల్లో వచ్చిన మొదటి డౌట్ కూడా అదే.. ఆయన గత సినిమాలేమో చాలా సున్నితమైన కథలతో మనసుకి హత్తుకునే భావోద్వేగాలతో తీశాడు అలాంటి డైరక్టర్ అసురన్ లాంటి మాస్ మూవీ ఎలా తీస్తాడా అని అనుకున్నారు. కాని డౌట్లన్నిటిని పటాపంచలు చేస్తూ నారప్పతో తన సత్తా చాటాడు శ్రీకాంత్ అడ్డాల. తన దగ్గర ఉన్న కథతో సురేష్ బాబుని మెప్పించే ప్రయత్నంలో అసురన్ రీమేక్ ఛాన్స్ తానే కావాలని అడిగాడని తెలుస్తుంది.

సినిమా విషయంలో శ్రీకాంత్ అడ్డాలకు పాస్ మార్కులు పడినట్టే. ఇక మీదట శ్రీకాంత్ అడ్డాల కూడా మాస్ కమర్షియల్ సినిమాలు తీయగలడు అని ప్రూవ్ అయ్యింది. అందుకే శ్రీకాంత్ అడ్డాల తన నెక్స్ట్ సినిమాలు పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో ఉండేలా చూసుకుంటున్నాడట. అయినా సరే కథ, కథనాల్లో తన మార్క్ మిస్ అవకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్నాయ్ అనే టైటిల్ తో ఒక సినిమా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో ఉంటుందని టాక్. అన్నాయ్ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. అన్నాయ్ సినిమాతో పాటుగా మరో యువ హీరో సినిమా కూడా లైన్ లో పెట్టాడట శ్రీకాంత్ అడ్డాల.




మరింత సమాచారం తెలుసుకోండి: