మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు చరణ్.ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.ఇక సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.అంతేకాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మొదటి షెడ్యూల్ ని షూట్ చేయనున్నారట.ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు శంకర్ హైదరాబాద్ లోనే ఉన్నారు.ఈ సినిమాకి కావాల్సిన కొకేషన్స్ ని వెతికే పనిలో పడ్డారు శంకర్.

మరో పక్క చరణ్ కోసం రకరకాల గెటప్స్ ని రెడీ చేయిస్తున్నారు.ఇందులో భాగంగా ఆ గెటప్స్ తో పలు ఫోటో షూట్ లను నిర్వహించి..వాటిలో ఒక గెటప్ ని ఫైనల్ చేస్తారట.అందుకోసం ఇప్పటికే స్కెచ్ ఆర్టిస్టులు,మేకప్ నిపుణులతో శంకర్ చర్చలు జరిపినట్లు సమాచారం.నిజానికి శనకర్ తన సినిమాలో హీరోలను రకరకాల గెటప్స్ లో చూపిస్తుంటారు.ఇక పైగా స్ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.మరి ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఒకవేళ ద్విపాత్రాభినయం కాకపోయినా.. చరణ్ ని మాత్రం ఓ సరికొత్త లుక్ లో చూపించడం ఖాయమని అంటున్నారు.

ఇక అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.చరణ్ సరసన ఈ సినిమాలో కియారా అద్వానీ ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి ఓ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ పాటలో చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా ఆడి పాడనుంది.అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: