సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ డేటింగ్ పేరుతో చెట్టపట్టాలేసుకుని తిరగడం సాధారణం. వారిపై రూమర్స్ సర్వసాధారణం. అంతేకాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా సెలబ్రిటీలకు ఇంకా క్రేజ్ పెరుగుతోంది. అందుకే కొంతమంది వారి మీద వచ్చే గాసిప్ లకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటారు. మరికొంతమంది లవ్ బర్డ్స్ సెలవులు కలిసి ఎంజాయ్ చేయడం, ట్రిప్స్, విందులు, పార్టీలలో ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ వారి రిలేషన్ పై మాత్రం అధికారిక ప్రకటన ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న టాప్ లవ్ బర్డ్స్ ఎవరో చూద్దాం.

సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ
గత కొంతకాలం నుంచి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చాలా సందర్భాలలో వీరిద్దరు కలిసి జంటగా కెమెరా కంటికి చిక్కారు.

కె.ఎల్ రాహుల్-శెట్టి
చాలా కాలం నుంచి ఇద్దరూ కలిసి ఉన్న క్యూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ వారి రిలేషన్ పై నోరు విప్పలేదు.

టైగర్ ష్రాఫ్ - దిశా పటాని
ఎస్ ఆర్ లవ్ బర్డ్స్ జంటగా సమయాన్ని గడుపుతూ ఎన్నోసార్లు కనిపించారు. అంతే కాదు ఒకరి ఇంటికి ఒకరు వెళ్తారు కూడా. ఒకరి ఫ్యామిలీతో మరొకరు చాలా క్లోజ్ గా ఉంటారు. వారి రిలేషన్ గురించి మీడియా ప్రశ్నించినప్పుడు చిన్న స్మైల్ ఇచ్చి తప్పించుకుంటారు.

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్
ఇది కొత్త జంట... సీనియర్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇటీవలే యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో పడింది అని అనిపిస్తోంది. వాస్తవానికి కత్రినా గతంలో చాలా మందితో ప్రేమాయణం వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ రిలేషన్ సీరియస్ గానే కనిపిస్తోంది. విడుదల చాలా సార్లు కలిసి మీడియాకు చిక్కారు. కానీ రిలేషన్ పై మాత్రం ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. వీరంతా అఫీషియల్ గా తమ పార్ట్నర్ లతో డేటింగ్ విషయమై అనౌన్స్మెంట్ ఇవ్వాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: