తెలుగు నిర్మాతలు ఇతర భాషల హీరోలపై దృష్టిని సారిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అదే విషయాన్ని సూచిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో ఒక ప్రాజెక్ట్‌ తెరకెక్కనుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం త్వరలో అధికారికంగా ప్రకటించబడుతుంది. ఏషియన్ సినిమాస్‌కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్ ఇటీవల ధనుష్‌తో ఒక ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తారు. శేఖర్ కమ్ములతో నారాయణ్ దాస్ ముందుగానే మూడు చిత్రాలు నిర్మించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే ధనుష్‌కు భారీ రెమ్యూనరేషన్ చెల్లించి మరీ ఈ ప్రాజెక్ట్ కోసం అతడిని ఒప్పించారు. మరో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా "జాతి రత్నాలు" దర్శకుడితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాను కూడా నారాయణదాస్ నారంగ్ నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇక మరో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. "మహానటి"లో నటించినప్పటి నుంచి వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కు దుల్కర్ సల్మాన్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ కాంబోలో హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న "లెఫ్టినెంట్ రామ్" తెరకెక్కుతోంది.

అయితే ఇందులో ఒక్క దుల్కర్ సల్మాన్ కు తప్ప మిగతా హీరోలందరికీ ఇది టాలీవుడ్ ఎంట్రీ. అంతేకాకుండా దుల్కర్ తప్ప వారంతా తమిళ హీరోలే. దీంతో తెలుగు హీరోలను విడిచి పెట్టి తమిళ హీరోల వెంట ఎందుకు పడుతున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారు. ఇక ప్రభాస్ అయితే అందనంత ఎత్తులో ఉన్నాడు. దీంతో అయితే ఈ నాలుగైదుగురు తప్ప టాలీవుడ్ లో ఆ రేంజ్ ఉన్న నటులే లేరా ? అనే ప్రశ్న ఎదురవుతోంది. సత్యదేవ్ లాంటి టాలెంట్ ఉన్న నటులను ఎంకరేజ్ చేయొచ్చు కదా. మన తెలుగు వాళ్ళను వదిలేసి కోలీవుడ్ స్టార్లను పాన్ ఇండియా స్టార్లుగా మార్చే పని ఎందుకు పెట్టుకుంటున్నారు ? అని నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. అది కూడా నిజమే కదా మరి!!

మరింత సమాచారం తెలుసుకోండి: