పెద్ద హీరోలు సినిమాలు లేకపోవడంతో ఈవారం కూడ చిన్న హీరోల సినిమాల హడావిడి కొనసాగుతోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’ మూవీకి సంబంధించి ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఇప్పుడు బయటపడింది. ఈసినిమాకు కోనవెంకట్ సమర్పకుడు.


జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో కోనవెంకట్ కు ఈమూవీ రచనకు సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రమేయం లేదు. అయినప్పటికీ ఈమూవీ పోస్ట‌ర్ మీద ఫ్ర‌మ్ ద రైట‌ర్ ఆఫ్ ‘ఢీ’ ‘రెడీ’ ‘దూకుడు’ అని వేసుకోవ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనితో చాలామంది ఈమూవీ స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో కోనవెంకట్ హస్తం ఉందా అని భావించారు అయితే ఆశలు విషయం వేరు.


ఈ విషయం పై కోనవెంకట్ ‘గల్లీ రౌడీ’ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో స్పందించాడు. తాను ఈ మూవీకి స్క్రిప్ట్ రైటర్ ను కానప్పటికీ ఈమూవీ పోస్ట‌ర్లో ఫ్ర‌మ్ ద రైట‌ర్ ఆఫ్ ‘ఢీ’ ‘రెడీ’ ‘దూకుడు’ అని వేయ‌డానికి కల కార‌ణం ఈ సినిమా కడా ఆ త‌ర‌హాలోనే ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్ గా ఉంటుందని కోనవెంకట్ తెలియ చేసాడు.



అంతేకాదు తాను ఏ హీరోతో తొలిసారి ప‌ని చేసినా ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం తనకు ఉంది అని అంటున్నాడు. ‘ఢీ’ సినిమా విష్ణుకు బ్లాక్‌ బ‌స్ట‌ర్ అయితే. రామ్‌తో తొలిసారి చేసిన ‘రెడీ’ కూడా ఘ‌న‌విజ‌యం సాధించింద‌ని ఎన్టీఆర్‌తో చేసిన తొలి సినిమా ‘అదుర్స్’ మహేష్ తో చేసిన ‘దూకుడు’ వారి తో తన తొలి సినిమాలు అంటూ ఒక కొత్త సెంటిమెంట్ ను బయటపెట్టాడు. ఇప్పుడు కూడ సందీప్ కిషన్ తో తాను చేస్తున్న మొదటి సినిమా ‘గల్లీ రౌడీ’ కాబట్టి అది గ్యారెంటీ హిట్ అని అంటున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తరువాత సరైన హిట్ లేక సతమతమై పోతున్న సందీప్ కిషన్ కు కోనవెంకట్ సెంటిమెంట్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: