ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు నేడు. అన్నా అయినా మొదటి సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

దర్శకుడు చలసాని రామారావు దగ్గర బాలకృష్ణ హీరోగా చేసిన 'ప్రాణానికి ప్రాణం' అనే సినిమా సమయంలో శ్రీను వైట్ల అసిస్టెంట్ గ  చేరాడు. ఆ సినిమా డిజాస్టర్. అదే సమయంలో 'శివ' విడుదలై రామ్ గోపాల్ వర్మ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. అసిస్టెంట్ గా చేద్దామనుకున్నా శ్రీనువైట్లకు అది కుదరలేదు. అంతకుముందు పరిచయం ఉన్న డైరెక్టర్ సాగర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి 'నక్షత్ర పోరాటం' అనే సినిమా చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అది ఆయనకు మొదటి చిత్రం. సాగర్ దగ్గరే 'అమ్మ దొంగ' చిత్రం వరకు పని చేశాడు. ఆ తరువాత సినిమాలు చేయగలననే నమ్మకంతో సాంబిరెడ్డి అనే నిర్మాత సహకారంతో రాజశేఖర్ హీరోగా 'అపరిచితుడు' మొదలుపెట్టాడు. కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే హీరోకి, నిర్మాతలకు వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల మొదట్లోనే అక్కడే ఆగిపోయింది.

నిరాశ పడకుండా ప్రయత్నించి 'నీ కోసం' కథ రాసుకున్నాడు. రవితేజ, మహేశ్వరి కాంబినేషన్ లో ఎలాగోలా ఈ సినిమా అయితే మొదలైంది. కానీ ప్రారంభం నుంచి అన్ని కష్టాలే. నిర్మాతల తలో రెండు లక్షలు వేసుకుని సినిమా మొదలు పెట్టినప్పటికీ బడ్జెట్ మధ్యలో అయిపోయింది. వేరే దారి లేక శ్రీను వైట్ల మరి కొంత పెట్టుబడి పెట్టాడు. ఎలాగోలా అష్టకష్టాలు పడి 38 లక్షలు 28 రోజుల్లో తీసిన సినిమా పూర్తి కావడానికి సంవత్సరన్నర పట్టింది. ప్రివ్యూ చూసిన నాగార్జున ఈయనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రామోజీరావు సినిమాను కొనుగోలు చేసి ఆంధ్రాలో విడుదల చేశారు. 1999 డిసెంబర్ 3న విడుదలైన ఈ సినిమా హిట్ కాకపోయినా కమర్షియల్ గా కోటి రూపాయల వసూళ్లు సాధించి డైరెక్టర్ గా మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా ఏకముగా ఏడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక రామోజీరావుకు శ్రీనువైట్ల మీద నమ్మకం రావడంతో 'ఆనందం' అవకాశం ఇచ్చారు. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: