మా అసోసియేషన్ లో ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు చూస్తుం టే అవి ఎక్కడికి దారితీస్తాయో అన్న భయం నెలకొంది ప్రతి ఒక్కరి లో. దీనికి ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఎండ్ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఓవైపు మోహన్ బాబు ఇంకొక వైపు చిరంజీవి రెండు వర్గాలుగా విడిపోయి సినిమా ఇండస్ట్రీని చీలిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడంతో ఈ విధమైన వివాదాలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి ఎండింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రమే దీన్ని ఆపగల దు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్ గా మా అసోసియేషన్ కు పనిచేశారు. ఆ తర్వాత ఎంతో మంది మహానుభావులు మా అసోసియేషన్ అభివృద్ధి చెందే విధంగా అధ్యక్ష పదవిలో కొనసాగారు. కొన్ని సంవత్సరాల వరకు అధ్యక్ష ఎన్నికలు లేకుండా బయట పడకుండా అసోసియేషన్ అసలు ఉందో లేదో అనిపించేలా ప్రశాంతంగా పనులు చేసుకున్నారు.

కానీ గత దశాబ్దకాలంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విమర్శలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. సాధార ణ ఎన్నికల రీతిలో రెండు పార్టీలు కొట్టుకున్నట్లుగా మా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తొమ్మిది వందల యాభై మంది ఉన్న అసోసియేషన్ లో ఈ విధమైన విమర్శలు వివాదాలు చెలరేగడం బహుశా దేశంలోనే తొలిసారి కావచ్చు.  కలి సి పని చేసిన వారు, చేయాలనుకునేవారు కూడా దారుణమైన విమర్శలు చేసుకోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఏదేమైనా నా మెగాస్టార్ చిరంజీవి మా సభ్యులందరికీ నచ్చజెప్పి వారందరినీ శాంతపరచి మునుపటిలా అంద రు కలిసి మెలిసి ఉండేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మెగాస్టార్ చిరంజీవి కి అందరి వద్ద ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించి ఆయన వ్యవహారాలను సద్దుమణిగేలా చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: