టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మెగా మేన‌ళ్లుడికి ఇండ‌స్ట్రీ లోనే ఏ హీరోకూ దొరకని బ్లాక్‌బస్టర్ ఎంట్రీ దొరికింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన‌ ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి స‌రి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి ప్రేమ క‌థ తో తిరుగులేని హిట్ కొట్టాడు వైష్ణ‌వ్‌. పైగా క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి టాలీవుడ్ కు ఎంతో ధైర్యం ఇచ్చింది.

అలాంటి వైష్ణ‌వ్ రెండో సినిమా గా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కొండ‌పొలం తెర‌కెక్కింది. నిజానికి అటు క్రిష్ లాంటి వైవిధ్య మైన ద‌ర్శ‌కుడు . మ‌రో వైపు ఓ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. తానా అవార్డు అందుకున్న న‌వ‌ల కావ‌డంతో రిలీజ్ కు ముందు ఈ సినిమా పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వానికి తోడు , ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ కావ‌డం కూడా సినిమాకు మంచి అప్లాజ్ వ‌చ్చింది.

క‌ట్ చేస్తే ఇప్పుడు రిలీజ్ అయ్యాక కొండపొలం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాబట్టలేకపోయింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు నిరాశ ప‌రిచే స్థాయిలో ఉన్నాయి. ఐదు కోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ మాత్రమే ఈ సినిమాకు వ‌చ్చాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ కావ‌డం ఖాయ మై పోయింది.

క్రిష్ న‌వ‌ల ను సినిమా తీస్తుండ‌డంతో చాలా త‌క్కువ బ‌డ్జె ట్ లోనే తెర‌కెక్కించి.. త‌క్క‌వ రేటుకే అమ్మినా కూడా బ‌య్య‌ర్లు న‌ష్టాల లో కూరు కు పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా తొలి సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన హీరో.. రెండో సినిమాకు రూ.5 కోట్ల షేర్ కూడా కాదు.. అంత‌కం టే త‌క్కువ రేంజ్ కు ప‌డిపోవ‌డం పెద్ద షాకే..!

మరింత సమాచారం తెలుసుకోండి: