విలక్షణ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు  కరోనా సమయంలో పేద ప్రజల పట్ల ఆరాధ్యదైవంగా మారారు సోనుసూద్. రీల్ లైఫ్ లో విలన్ గా వ్యవహరించిన ఆయన రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.ఇక తన సేవా కార్యక్రమాల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక సహాయం చేయడానికి తన ఆస్తులను కూడా లెక్కచేయకుండా ఒక స్వంత సంస్థను కూడా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు సోనుసూద్. ఇక చిన్నారులకు సైతం గుండె ఆపరేషన్లు చేయించడం ద్వారా  పేదల పాలిట దైవంగా మారిపోయాడు.

 అయితే కొంతమంది సోనూసూద్ సేవా కార్యక్రమాలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు ఈ రియల్ హీరో. ఆ వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన బిందు ప్రియా కృష్ణ దంపతులకు సంవత్సరం వయసున్న ఓ బాబు ఉన్నాడు. పుట్టినప్పటినుంచి ఆ బాబు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారడు. ఆపరేషన్ చేయడానికి వైద్యులు ఏకంగా ఆరు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పగా.. అంత డబ్బు లేకపోవడంతో కృష్ణ దంపతులకు చిన్నారికి వైద్య చికిత్స చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

 అయితే కృష్ణా జిల్లాకు చెందిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు చిన్నారి ఆరోగ్య సమస్య గురించి సోనూసూద్ గారికి చెప్పగా..ఆ చిన్నారి దంపతులను సోను సూద్ ముంబైకి రప్పించారు. ముంబైలోని వాడిన ఆసుపత్రిలో చిన్నారికి చికిత్సను జరిపించగా.. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగుందని  వైద్యులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూ మంచి మనసు చాటుకోవడం.. ఇటు చిన్నారుల పట్ల తన గొప్ప మనసు చాటడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సోనూసూద్ ని మెచ్చుకుంటున్నారు.ఇక చిన్నారి ప్రాణాన్ని కాపాడినందుకు సోనూసూద్ కి కృష్ణ దంపతులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: