పందెం కోడి సినిమా తో తెలుగులో పరిచయం అయిన తమిళ హీరో విశాల్. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మాస్ ప్రేక్షకులకు బాగా ఎక్కిన ఆ సినిమా ఫ్యాక్షన్ సినిమాలలో కొత్త ట్రెండ్ ను సృష్టించి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇక ఆ సినిమా తెచ్చిపెట్టిన విజయంతో అప్పటి నుంచి తెలుగులో వరుస సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు విశాల్. అలా అయన తెలుగు హీరోలకు సమానంగా మంచి మార్కెట్ ని సంపాదించుకుని మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు.

ఆ మధ్య ఆయనకున్న క్రేజ్ తో ఓ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. సెల్యూట్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని కొట్టిన విశాల్ ఆ తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా వరుసగా తెలుగు లో సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే అయన చక్ర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తో వెరైటీ సినిమాల కథానాయకుడు అనిపించుకున్నాడు విశాల్.

తాజగా అయన ఎనిమి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవిధంగా ప్రణాళికలు వేశాడు. దీపావళి కి ఈ సినిమా ని తమిళనాడు లో తీసుకువస్తుండగా తెలుగు లో అదే టైం కి తీసుకు రావాలని భావిస్తున్నాడు. ఐటిహీ ఆ సినిమా కి విశాల్ కి ధియేటర్ ల సమస్య రావడం ఇప్పుడు ఆయనని అవమానపరిచినట్లుగా భావిస్తున్నారు అయన అభిమానులు.. తెలుగు సినిమా లతో పాటు రజినీకాంత్ పెద్దన్న సినిమా దీపావళి కి రిలీజ్ అవుతుండగంతో ధియేటర్ ల కొరత ఏర్పడింది.. మరి విశాల్ తన సినిమా ను ఇన్ని క్రేజీ సినిమాల మధ్య తీసుకొస్తాడా లేదా కొన్ని రోజులు ఆగి తెలుగు లో మళ్ళీ రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: