హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా ఈ ముద్దు గుమ్మకు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయింది, మరియు క్రేజ్ ను కూడా తెచ్చి పెట్టలేకపోయింది. ఇలా మొదటి సినిమా ప్రగ్యా జైస్వాల్ కు టాలీవుడ్ లో నిరాశ పరిచినప్పటికీ ఈ ముద్దు గుమ్మకు రెండో సినిమా కంచె తో మంచి విజయం దక్కింది. వరుణ్ తేజ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ప్రగ్యా జైస్వాల్ నటనకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇలా టాలీవుడ్ లో రెండవ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ నక్షత్రం, జయ జానకి నాయక సినిమా లో నటించి మెప్పించింది. కాకపోతే ఈ ముద్దు గుమ్మకు మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఇప్పటి వరకు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర తగ్గలేదు.

అలాంటి సమయం లోనే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది.  ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది, ఈ సినిమాపై జనాల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి, దానికి ప్రధాన కారణం ఇప్పటికే బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లి తెరకెక్కిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అవడమే, వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హైడ్రిక్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని ఎంతో మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మెయిన్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది, మరి ఈ సినిమా ఈ ముద్దు గుమ్మకు ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: