ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజా హెగ్డే. ప్రస్తుతం అందరు స్టార్ హీరోలకు లక్కీ ఛార్మి గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడితో సినిమా చేస్తే చాలు ఇక మంచి విజయాన్ని సాధించవచ్చు అని ప్రస్తుతం దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారు.  తమ సినిమాల్లోకి పూజా హెగ్డే ని తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో ఈ అమ్మడు అందాల ఆరబోతలో కూడా ఎక్కడా లిమిటేషన్స్ పెట్టకపోవడంతో దర్శక నిర్మాతలు అందరికీ కూడా పూజాహెగ్డే ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.


 ఇక ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన లక్ పరీక్షించుకుంటూ ఉంది.. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటే చాలు పూజా హెగ్డే క్రేజ్ మరింత పెరిగి పోతుంది అని చెప్పాలి. ఇకపోతే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..



 ఇటీవలే ఇంటర్వ్యూకు హాజరు అయింది పూజాహెగ్డే. ఇంటర్వ్యూలో పెళ్లి పై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించగా... ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా.. అవి చేసిన వాళ్లకే వీటి గురించి ఎక్కువగా తెలుస్తోంది. ఇటీవలే ముంబైలో ఇల్లు కట్టుకున్నా.. ఇల్లు కట్టుకోవడమే ఇలా ఉంటే పెళ్లి ఎలా ఉంటుందో అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. అయితే పెళ్ళి విషయంలో నేను నమ్మేది ఒక్కటే వీళ్ళతో జీవితాంతం కలిసి ఉంటే బాగుంటుంది అని ఒక నమ్మకం వచ్చింది అంటే చాలు వెంటనే పెళ్లి చేసుకోవడమే అంటూ పూజా హెగ్డే తెలిపింది. ఇంట్లో ఒత్తిడి వల్ల లేదా అందరూ పెళ్లి చేసుకుంటున్నారు అన్న కారణంతో పెళ్లి చేసుకోకూడదు మనసులో మాట చెప్పింది పూజా హెగ్డే.

మరింత సమాచారం తెలుసుకోండి: