కీర్తి సురేష్ కు కొంతకాలం క్రితమే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే, ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ తో పాటు ఈ సినిమా హీరో మహేష్ బాబు కు, సంగీత దర్శకుడు తమన్ కూడా కరోనా బారిన  పడిన విషయం మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే తమన్ కరోనా బారి నుండి బయట పడగా మహేష్ బాబుకు సంబంధించిన అప్డేట్ బయటకు రాలేదు, కీర్తి సురేష్ కి నాలుగు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది, నాకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయి, కాకపోతే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, అందరూ కూడా కరోనా నిబంధనలను పాటించండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి కరోనా వైరస్ చాలా ఉధృతంగా పెరుగుతుంది, చాలా భయాందోళనలు కలిగిస్తోంది.

 అందరూ కూడా వ్యాక్సిన్స్ వేయించుకోండి, సురక్షితంగా ఉండండి, అంటూ సోషల్ మీడియా ద్వారా కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ జనవరి 11 వ తేదీన సోషల్ మీడియా లో కీర్తి సురేష్ చేసింది, అయితే కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు, దీనితో కీర్తి సురేష్ కు దేవి శ్రీ ప్రసాద్ క్షమాపణలు తెలిపాడు. సారీ కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్నాను అంటూ దేవి శ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ కు సారీ చెప్పాడు, డియర్ కీర్తి సురేష్.. ఇది లేటుగా చూశాను.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావని, కోలుకుంటున్నావని ఆశిస్తున్నాను, ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. మళ్లీ తిరిగి వెంటనే పనిలోకి మరింత శక్తితో వస్తావని ఎదురుచూస్తున్నాను అని దేవీ శ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కార్ వారి సినిమాతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: