ఈ ఏడాది అక్కినేని నాగచైతన్య బంగార్రాజు చిత్రం తో సూపర్ హిట్ అందుకొని తన సక్సెస్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. లవ్ స్టోరీ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ప్రేక్షకులను అలరించే బంగార్రాజు చిత్రాన్ని చేసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలా వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న నాగచైతన్యకు ఇప్పుడు మరిన్ని మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. అక్కినేని వారసుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన నాగచైతన్య ఇప్పటి వరకు మంచి సినిమాలతోనే ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.

ఆయన వివాహబంధం తెగిపోయిన కూడా ప్రేక్షకులను ఆనందింప చేయాలనే ఉద్దేశంతో సినిమాలను చేస్తూనే ఉన్నాడు. అలా బంగార్రాజు చిత్రాన్ని ఎంతో కాన్ఫిడెంట్ గా చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యు అనే ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో రాశీ కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా వెరైటీ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తుంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసుకుంటుంది.

ఇక దీని తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు చిత్రం రీమేక్ కూడా నాగచైతన్య చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా చేస్తే నాగచైతన్యకు ఇది మంచి సినిమా అవుతుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కాబట్టి మంచి సక్సెస్ ఉన్న దీన్ని నాగచైతన్య సినిమా చేస్తే మరొక సక్సెస్ అందుకోవడం ఖాయం కాబట్టి ఈ సినిమాను ఆయన చేయడమే మంచిది అని కొంతమంది అక్కినేని అభిమానులు ఆయనకు సూచిస్తున్నారు. మరి దీనిపై నాగచైతన్య ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: