తెలుగు సినిమా నటుడు సునీల్ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సునీల్ కెరియర్ ప్రారంభంలో కమెడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి,  టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ కమెడియన్ గా మారిపోయాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ కమెడియన్ గా మారిన సునీల్ 'అందాల రాముడు' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

 ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో పాటు సునీల్ కూడా హీరోగా మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత సునీల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ పాత్రలకు , ఇతర పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సినిమా ల్లో హీరోగా నటించాడు. కాక పోతే హీరో గా సునీల్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.  దానితో ప్రస్తుతం సునీల్ మళ్ళీ తనకు ఎంతో అచ్చి వచ్చిన కమెడియన్ పాత్రలలో , ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.  అందులో భాగంగా ప్రస్తుతం సునీల్ , రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

 తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సునీల్ తెలియజేస్తూ... రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  సినిమాలో నా పాత్ర మామూలుగా ఉండదు అని,  శంకర్ నా పాత్రను అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేశాడు అని,  ఈ సినిమాలో నా పాత్ర నా కెరియర్ లోనే ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది అని సునీల్ తెలియజేశాడు. ఈ సినిమాలో చాలా సమయం నేను కనిపిస్తాను అని సునీల్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: