భారతీయ సినీ నటి శ్రీదేవి జయంతి ఈరోజు.. బాలనటిగ వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. శ్రీదేవి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం ,హిందీ వంటి భాషలలో కూడా కొన్ని వందల సినిమాలలో నటించింది. అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సైతం మంత్రం ముద్దులను చేసిందని చెప్పవచ్చు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటిగా పేరు పొంది. 1963 లో ఆగస్టు 13న తమిళనాడులో జన్మించింది శ్రీదేవి.

 శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యప్పన్ యంగర్. ఈమె సినిమాలలో నటించడం కోసమే తన పేరు మార్చుకున్నది శ్రీదేవి నాలుగేళ్ల వయసులోని నటించడం ప్రారంభించినది. శ్రీదేవి తమిళ సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా మొదట తన జీవితాన్ని ప్రారంభించింది. బాలీవుడ్ చిత్రమైన జూలీతో చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత పదహారేళ్ళ వయసు అని సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. శ్రీదేవి కెరియర్ల స్టార్ హీరోలతో కూడా పనిచేసింది రజినీకాంత్ ,ఎన్టీఆర్ ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున ,వెంకటేష్ తదితర హీరోలతో కూడా నటించింది.


ఇక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకున్నది. శ్రీదేవి తన సినీ జీవితంలో 200 పైగా సినిమాలలో నటించింది. ఈమెకు అందం ఈమె నవ్వే అని చెప్పవచ్చు అంతేకాకుండా రొమాంటిక్ స్టైల్ లో కూడా ప్రేక్షకులు ప్రశంసలు అందుకుంది. 1975 నుంచి 1990 వరకు ఈమె నటించిన అన్ని సినిమాలు అన్ని భాషలలో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇక శ్రీదేవి తన వ్యక్తిగత విషయానికి వస్తే.. శ్రీదేవి బోనికపూర్ ను వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరికీ జాన్వి కపూర్, ఖుషి కపూర్ అనే కుమార్తెలు జన్మించారు. శ్రీదేవి తన కెరియర్లు ఎన్నో చిత్రాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో తాను నివసిస్తున్న హోటల్లో ప్రమాదవశాత్తు ఈమె మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: