టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఎంతో ఒదిగే ఉంటారు.లైట్ మెన్ నుంచి ఒక స్టార్ హీరో హీరోయిన్ వరకు ఈయన అంతే గౌరవ మర్యాదలు ఇస్తూ మాట్లాడుతుంటారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు. ఒక్క సారి మెగాస్టార్ మాటిచ్చారంటే ఆ మాటపై నిలబడతారని ఇదివరకు ఎన్నో సార్లు  ఆయన నిరూపించారు.ఇకపోతే తాజాగా చిరు ఇచ్చిన మాట పై నిలబడతారని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు చిరు .అప్పుడేప్పుడో బిగ్ బాస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసినటువంటి కంటెస్టెంట్ దివికి ఒక మాట ఇచ్చారు.భవిష్యత్తులో తన సినిమాలో తప్పకుండా దివికి అవకాశం కల్పిస్తానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ మాటను గాడ్ ఫాదర్ సినిమా ద్వారా నెరవేర్చినట్లు తెలుస్తోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ దివికే మంచి అవకాశం కల్పించారనే వార్తలు వినపడుతున్నాయి.తాజాగా ఈ విషయాన్ని బిగ్ బాస్ బ్యూటీ దివి వెల్లడించారు. ఈ సినిమాలో ఈమె ఊటీలో షూట్ చేసే సన్నివేశంలో కొన్ని నిమిషాల పాటు సందడి చేసినట్లు వెల్లడించారు.ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ చాలా కీలకమైన పాత్రలో నటించారని తెలుస్తోంది.ఈ సన్నివేషంలో దివి మెగాస్టార్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడుతూ భారీ డైలాగ్ చెప్పే సన్నివేశమని ఇలా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ ఒక్క డైలాగ్ చెప్పిన ఆ క్షణం తన జీవితానికి చాలు అంటూ దివి వెల్లడించారు.

ఇక తన కెరియర్ గురించి మాట్లాడుతూ తనకి ఇప్పుడప్పుడే పెద్దపెద్ద అవకాశాలు ఏమి రాలేదని అయితే తనకు మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఈమె తెలియజేశారు.ఇది తెలిసిన దివి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేయగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మాత్రం దట్ ఇస్ మెగాస్టార్ అంటూ తమ అభిమాన హీరో పై  అభిమానులు ప్రశంశూలలు కురిపిస్తున్నారు.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నయనతార సత్యదేవ్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో మనం వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: