పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ భారీ బడ్జెట్ క్రేజీ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిది అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలను ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేషాలు ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నాడు అని , ఆ మూవీకి డి వి వి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడు అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రేపే ఈ మూవీ యూనిట్ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే సుజిత్ ఆఖరుగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: