తమిళ నటుడు అజిత్ కుమార్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఆయనకు భారీ స్థాయి విజయాలు దక్కడం లేదు. దానితో ఆయన అభిమానులు కూడా కాస్త డిసప్పాయింట్ అవుతూ వస్తున్నారు. ఇలా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న సమయంలోనే అజిత్ కుమార్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. ఇలా ఈ మూవీ కి మంచి టాక్ రావడం , మంచి ఓపెనింగ్లు కూడా రావడంతో ఈ సినిమా చాలా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుంది అని అజిత్ అభిమానులు అనుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 15 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయిన ఈ సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోలేదు. ఈ మూవీ ఫార్ములాకు అత్యంత దగ్గరగా వచ్చింది. దానితో ఈ మూవీ ఎప్పుడు బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుందా అని అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి 15 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

15 రోజుల్లో ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 143.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.25 కోట్లు , కర్ణాటక ఏరియాలో 14.10 కోట్లు , కేరళలో 3.35 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.35 కోట్లు , ఓవర్సీస్ లో 62.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 113.45 కోట్ల షేర్ ... 231.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 116 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 2.55 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak