
ప్రస్తుతం అంతా ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది. శరీరానికి సరైన విశ్రాంతి ఉండటం లేదు. మధ్యాహ్నం ఓ చిన్న కునుకు తీస్తే రెట్టింపు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తాం. ఇంట్లో ఉండే వాళ్లకు ఇది సాధ్యమవుతుంది. మరి ఉద్యోగాలలో ఉన్న వారికి ఎలా ? అలా అని ముంచుకొస్తున్న నిద్రను నియంత్రిస్తే చేసే పని మీద ధ్యాస లేక ఒత్తిడి ఎక్కువ అయ్యి పనిలో నాణ్యత తగ్గిపోతుంది. కొన్నిసార్లు అనుకున్న సమయానికి పని పూర్తి చేయలేం. అందుకే ఇప్పుడు కొత్తగా ఇలాంటి వారికి న్యాపుచీనో నిద్ర వచ్చేసింది అంటే కాఫీ నిద్ర ... నిద్ర కుమ్ముకు వచ్చే టప్పుడు కాఫీ తాగాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాలు నిద్రపోతే సరిపోతుంది. దీనిని న్యాపుచీనో అంటారు.
ఇది కూడా పవర్ న్యాప్ లాంటిదే .. కాకపోతే కాఫీ అదనంగా ఉంటుంది. మన శరీరంలో అలసటకు ప్రధాన కారణం అడెనోసిన్? నిద్ర దీని స్థాయిలని తగ్గిస్తుంది. మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. అయితే నిద్రకు ముందే కాఫీ తాగుతాం కాబట్టి దీనిలో ఉండే కెఫిన్ పనిచేయటం మొదలవుతుంది. ఇది మానవ శరీరానికి సరికొత్త తాజాదనాన్ని ఇచ్చి వారు మరింత చురుకుగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. దీంతో వెంటనే పనిమీద అలర్ట్ అయ్యి ఫోకస్ మోడ్ లోకి వెళ్లిపోవచ్చు. మధ్యాహ్నం అలసిపోయినప్పుడు ... డ్రైవింగ్ కి ముందు ఈ న్యాపుచీనో వేస్తే మరింత ఉత్సాహంతో పని చేయవచ్చట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు