ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ యువతకు... ఉపాధి కల్పించే అవకాశాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ శిక్షణ కూడా ఇవ్వనుంది. జర్మనీలో నర్సుల కొరత విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జర్మనీలో వృద్ధుల నర్సుల అవసరం చాలా ఉందని తెలుస్తోంది.

 ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి నర్సులను నియామకం చేసుకునేందుకు  జర్మనీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం అందుతుంది.  చాలామంది నర్సులు జర్మనీలో ఉద్యోగం చేయడానికి కూడా... ఇంట్రెస్ట్ చూపించడం కూడా ప్రధాన కారణం. మంచి జీతం వస్తుందని అక్కడికి వెళ్తున్నారు. అయితే దీని గ్రహించిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తోంది.

 అయితే అక్కడికి వెళ్లాలంటే.. నైపుణ్యతతో పాటు శిక్షణ అవసరం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు ఇచ్చేలా కసరత్తులు చేస్తోంది  చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు కూడా ఇప్పటికే శిక్షణ ప్రారంభించారు. గత... డిసెంబర్ నుంచి ఈ శిక్షణ ప్రారంభమైంది. ఇందులో ఉద్యోగం సంపాదించిన వారికి విమాన టికెట్లతో పాటు వీసా అలాగే ధృవపత్రాలన్నీ ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం.  వీళ్లకు నెలకు 2.7 లక్షల నుంచి 3.2 లక్షల వరకు జీతం కూడా ఉంటుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: