ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కు మోదీ అభినందనలు తెలిపారు. ఇవి కేవలం శంకుస్థాపనలు కాదని ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు నిదర్శనాలు అని మోదీ చెప్పుకొచ్చారు. దాదాపుగా 60 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాం అని మోదీ చెప్పుకొచ్చారు. ఒక కల సాకారం అవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తోందని ఆయన అన్నారు.
 
ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై ఉన్నానని దుర్గా భవానీ కొలువైన పుణ్యక్షేత్రంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. అమృత్ భారత్ కింద రైల్వేలను ఆధునీకరించామని ఆయన తెలిపారు. ప్రతి పొలానికి నీరు అందించాలని రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదని తమ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
 
ప్రస్తుతం రైల్వే బడ్జెట్ 9000 కోట్ల రూపాయలకు పెరిగిందని మోదీ వెల్లడించారు. పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తాయని ఆయన తెలిపారు. రేణిగుంట నాయుడుపేట హైవే వల్ల తిరుపతి వేగంగా చేరుకోవచ్చని మోదీ వెల్లడించారు. సాగునీరుకు ఇబ్బంది లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నామని మోదీ కామెంట్లు చేశారు.
 
మన ఆయుధాలే కాదు ఐకమత్యమే మహాబలం అని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని మోదీ వెల్లడించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు యోగా దినోత్సవం రోజున ఏపీలో పర్యటిస్తానని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోందని సరైన వేగంతో ముందుకెళ్తోందని ఆయన తెలిపారు. మోదీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: