తమిళ నటుడు సూర్య టాలీవుడ్ ఇం డస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూ వీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అధికారికంగా లంచ్ కూడా జరిగింది. ఈ సినిమాలో నటించబోయేది ఎవరు ..? ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్స్ ఎవరు అనే వివరాలను తెలుసు కుందాం.

మూవీ లో ప్రేమలు సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని అదిరిపోయే రేంజ్ ను క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ అయినటువంటి మమత బైజు హీరోయిన్గా కనిపించబోతోంది. రవీనా టాండన్ , రాధికమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... నిమిషి రవిమూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. నవీన్ నోలి ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేయనుండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుండగా ... ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సూర్య కాస్త అపజయాలను అందుకుంటున్న ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి మాత్రం వరుస పెట్టి మంచి విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తమిళ హీరో , తెలుగు దర్శకుడి కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై తమిళ్ , తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: